Skip to main content

Posts

Featured

గ్రహాంతరవాసి పార్ట్ 1

 గ్రహాంతర వాసి పార్ట్ 1 టైం ఉదయం 9 గంటలు "ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్" మంటూ తన ఫోన్ మొగుతూనే ఉంది.ఆ సౌండ్ కి ఇంత పొద్దున్నే ఎవడు రా బాబు ఫోన్ చేసింది మంచి నిద్ర చెడ కొట్టారు అనుకుంటూ అప్పటి దాక ఘాడ నిద్రలో ఉన్న రాఘవ చిరాకు గా ఫొన్ లిఫ్ట్ చేసి ఆ నిద్ర మత్తులో హాల్లో ఎవరు? అన్నాడు. హాల్లో రాఘవా నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తున్న వెంటనే నువ్వు అక్కడికి వేళ్ళు నేను కూడా వస్తున్న అని చెప్పాడు వాళ్ళ పై ఆఫీసర్. అది విని నిద్ర మత్తు పూర్తిగా వదిలింది తనకి. తప్పకుండా ఇప్పపుడే వెళ్తున్నాను సార్ అంటూ లేచి  త్వరగా రెడీ అయ్యిపోయి తన కార్ లో ఆ ప్రదేశానికి బయలుతేరి వెళ్ళాడు. అతను ఆ ఊరికి చేరుకోగానే ఆ ఊరులో ఉన్న జనం మొత్తం ఊరి బయట ఉన్న పొలాల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.అది చూసిన రాఘవ వాళ్లలో ఒకడిని  పిలిచి హాల్లో బాబు ఎక్కడికి?అందరూ ఇంత ఖంగారుగా పరిగెడుతున్నారు అంటూ  అడిగాడు. ఊరు బయట పొలాల్లో ఎదో జరిగింది అంట అందరం అక్కడికే పోతున్నాం అని చెప్పి అతను మళ్ళీ పరిగెత్తడం మొదలు పెట్టాడు. రాఘవ వెంటనే కార్ లో ఆ ప్రదేశం చేరుకునే సరికి ఆ జనం అంతా అక్కడే గుమిగూడి  గుస గుస లాడుతూ ఉన్నారు...

Latest Posts